Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.. Rice Tension: కోట్లాది మందికి అన్నమే మన భారత దేశంలో ప్రధాన ఆహారం.. దక్షిణ భారత దేశంలో అన్నమే ఎక్కువంది రోజూ తీసుకుంటారు. కొందరు మూడు పూటలూ తింటే.. మరికొందరు రెండు పూటల తింటారు.. కానీ అన్నం లేని రోజు అంటూ ఉండదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే 99 శాతం మంది అన్నమే తింటారు.
వైద్యుల సూచన మేరకు మాత్రమే కొందరు.. అన్నానికి దూరంగా ఉన్నా.. ఇంట్లో మిగిలిన వారిలో ఒకరి ఇద్దరైనా..? అన్నం తినకుండా ఉండరు. ముఖ్యంగా పేదలు, సామాన్యులకు అయితే ఏం లేకపోయినా బియ్య ఒక్కటి ఉంటే చాలా హ్యీపీగా బతికేస్తారు. రెండు పూటల అన్నం తింటూ జీవనం సాగిస్తారు. కానీ ఇకపై సామాన్యులు అందరికీ షాక్ తగలక తప్పదేమో..?
పూర్తిగా అన్నం అన్న సంగతే మరిచిపోవాల్సి వస్తుంది ఏమో.. ఎందుకంటే..? ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. రెండు నెలల వ్యవధిలో కిలోకు 10 నుంచి 15 పెరిగాయి. ఇంకా పెరుగుతాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వినియోగించే లలిత, బెల్, డైమండ్ బ్రాండ్లకు చెందిన బియ్యం 26 కిలోల బస్తాను మార్కెట్లో దాదాపు 1500 రూపాయలకు అటు ఇటుగా విక్రయిస్తున్నారు.
బియ్యం వ్యాపారం చేసే మిల్లర్లు ఆ నెలలో 25 కిలోల బస్తాపై 100 రూపాయలు పెంచేశారు. లలిత, బెల్, డైమండ్ వంటి రకాల ధరను 1,200 రూపాయల నుంచి 1,300 రూపాయలకు పెంచేశారు. సాధారణ వెరైటీలు 1,050 నుంచి 1,150 రూపాయల వరకు పెరిగాయి.
25 కిలోల వరకు మాత్రమే జీఎస్టీ వర్తిస్తుందని కౌన్సిల్ ప్రకటించింది. దీంతో జీఎస్టీని ఎగ్గొట్టడానికి మిల్లర్లు కొత్త ఎత్తుగడ వేసి బియ్యం బస్తాను 25 నుంచి 26 కిలోలకు పెంచి మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో జూలై మూడో వారంలో పెంచిన రేట్లను తగ్గించాలి. కానీ రాష్ట్రంలో ధాన్యానికి కొరత వుందని సాకు చెప్పడంతోపాటు ఎగుమతి రకాలపై 15 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించినందున బియ్యం ధరలు పెంచాల్సి వచ్చిందని కుంటిసాకులు చెప్పాన్నారు. దీంతోనే లలిత, బెల్, డైమండ్ రకాలపై ఇటీవల మరో 100 నుంచి 150 రూపాయల వరకు పెంచారు.
సాధారణ రకాలు అయితే 1,200 రూపాయల నుంచి 1,300 రూపాయలకు అమ్ముతున్నారు. విశాఖలో మొత్తం వ్యాపారంలో లలిత, బెల్ వాటా సుమారు 60 శాతం కాగా, మిగిలిన అన్ని రకాలు కలిపి 40 శాతం వుంటుందని వ్యాపారులు చెబుతున్నారు. విశాఖ మార్కెట్‌పై గుత్యాధిపత్యం వహించే ప్రముఖ బ్రాండ్లు చెప్పినట్టు మిగిలిన కంపెనీలు, మిల్లర్లు వినాల్సి వస్తోందని బియ్యం వ్యాపారులు చెబుతున్నారు.