Tamarind: ప్రతి వంట గదిలో తప్పక ఉండాల్సిన ఐటెమ్స్ లో చింతపండు ఒకటి. అది లేనిదే రోజు వారీ ఏ వంటా పూర్తి కాదు.. పప్పు నుంచి పులుసు వరకు.. పులిహార నుంచి కూడా వరకు అన్నింటిలోనూ చింతపండు తప్పని సరి.. దేనికైనా రుచి రావాలి అంటే చింతపండు పులుపు తగలాల్సిందే..? కానీ అలాంటి చింతపండు గురించి ఇక మరిచిపోవాల్సిందేనా?
చాలాచోట్ల ఇదే పరిస్థితి.. దీంతో సాగుపై గిరిజన రైతుల్లో ఆశలు సన్నగిల్లాయి. ఆశించిన స్థాయిలో జీడిపంట లేకపోగా, చింత దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. అందుకే దాని మీద ఆధారపడిన వారికి ఈ ఏడాది నిరాశే తప్పలేదు. వాస్తవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, కొమరాడ, పాచిపెంట ప్రాంతాల్లో 5 వేల క్వింటాళ్లు, సీతంపేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాళ్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది.
ఈ ఏడాది పెద్దఎత్తున చింతపండు కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గత ఏడాది 32.50 పైసలకు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మద్దతు ధరను ఇంకా నిర్ణయించలేదంటున్నారు. గిరిజనుల నుంచి సేకరించిన చింతపండుకు గతంలో ఆన్లైన్ చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.