పారిజాత, పుత్రజీవక, అర్జుర, కీతకి, కృష్ణబీజ, నాగదంతి, రక్తనిర్వాసం, రక్తచందనం, రోహిష, వనవలాండు, వికంకత, శతావరి, నేలమేవు, తిప్పతీగ(గుడుచి), నల్లేరు, విషముష్టి, లంకామొదం, సుగంధపాలు, జిల్లేడు, నెల్లఉప్పి, కోరింత, ఊడుగాం, సరస్వతి, తెల్లఈశ్వరి,
నల్లఈశ్వరితో పాటు అనేక రకాల వనమూలికలు ఈ ప్రాంతంలో ఉండేవని సమాచారం.
ప్రస్తుతం ఇందులో సుమారు 30 రకాల మూలికలు స్థానికులు సేకరించి.. ఆయుర్వేద నిపుణులకు ఇస్తూ ఉంటారు. వర్షాలు కురిస్తే చాలు.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయుర్వేద పండితులు మహేంద్రగిరుల్లో సంచరిస్తూ వనమూలికలను సేకరిస్తారు. ప్రధానంగా మందస, పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, కంచిలి, పర్లాకిమిడి, నారాయణపురం ప్రాంతాల్లో ఉండే ఆయుర్వేద నిపుణులు వీటిని సేకరించి వైద్యాన్ని అందిస్తున్నారు.
అల్లోపతి వైద్యం కన్నా ఆయుర్వేదం సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా దుష్ప్రభావాలు రాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
అవుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ద్వారా వన సంరక్షణ సమితులను
ప్రారంభించడమే కాకుండా వాటిని బలోపేతం చేసింది. కేవలం వనౌషిత మొక్కలను పెంచడానికి ప్రత్యేక కమిటీని నియమించింది.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వనౌషిత మొక్కలపై మక్కువ చూపిస్తున్న నేపథ్యంలో వీటి ప్రాధాన్యం పెరిగింది. మహేంద్రగిరుల్లో ప్రకృతి పరంగా లభ్యమయ్యే ఔషధ మొక్కలను సేకరించి వాటి కోసం గిరిజనులకు ప్రోత్సహిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు గిరిజనులకు కూడా
జీవనభృతి కలుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.