P. Anand Mohan, News18, Visakhapatnam.. Tribal protest: ఓ వైపు దేశ వ్యాప్తంగా ఆదివాసి దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల మఖ్యమంత్రులు.. మంత్రులు.. ఇతర రాజకీయ నేతలు ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. ఆదివాసీల ఆదుకునేందుకు అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ఆదివాసీల పరిస్థితి చూస్తే.. ఇంత దారుణమా అనిపించక మానదు..
12 నుంచి 14 ఏళ్ల పిల్లలు 15 మంది ఉన్నారు అయినా.. ఇంతమంది చిన్నారులు ఉన్నా.. కనీసం అంగన్వాడి సెంటర్ కూడా ఎందుకు లేదని ప్రశ్నిస్తోంది. ఒక్క ప్రభుత్వ స్కూలు కూడా లేదన్నారు. తాము స్కూల్ కి వెళ్లాలంటే కుమ్మరుల గ్రామంలో స్కూలు ఉందని.. దాని కోసం దాదాపు నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది అన్నారు.
పోనీ అలా నిత్యం సాహసం చేస్తూ.. స్కూల్ వెళ్లినా.. టీచర్లు రాకపోవడంతో తమ పిల్లలను చదివించుకోలేకపోతున్నామంటున్నారు. రోడ్డు లేకపోవడంతో తాము రేషన్ కోసం వెళ్లాలన్నా.. 20 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇటు బొంకుల పాలెం గ్రామానికి చేరుకోవాలి అన్నా.. ఎనిమిది కిలో మీటర్ల ఎత్తైన ఘాట్ రోడ్డు గుండా నడుచుకుని వెళ్లడం కష్టంగా ఉందంటున్నారు.
ప్రభుత్వం అందించే బియ్యం.. 20 కేజీల బియ్యం కి 20 రూపాయలు ఖర్చు అవుతుంటే.. తాము రవాణ కోసం 300 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. ఓట్లు వేసిన గెలిపిస్తున్నా.. తమపై పాలకులు ఎందుకు కరుణ చూపించడం లేదని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమను మనుషులుగా కూడా చూడకపోవడం దారుణమని మండిపడుతున్నారు.