ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. అధికారంలోకి రాకముందు సంపూర్ణ మద్య నిషేదం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయిేత అధికారంలోకి వచ్చిన తరువాత ఇందుకు సంపూర్ణ మధ్యపాన నిషేధం పేరుతో ఆంక్షలు పెంచుతూ వెళ్లింది. మద్యం షాపులను కేవలం ప్రభుత్వం ఆధీనంలోనే పెట్టింది. టైమింగ్స్ లో మార్పులు చేసింది. కొన్ని బ్రాండ్ లను మాత్రమే ఎంపిక చేసి ధరలను భారీగా పెంచేసింది.
వారికి వచ్చిన సమాచారం మేరకు రావులపాలెం పోలీసులు జిల్లా స్పెషల్ బ్రాంచ్ టీమ్ వెళ్లి రావుల పాలెం హై వే కి దగ్గరలో ఉన్న నాయుడు లే అవుట్ లో గౌ డౌన్ లో దాడి చేశారు. ఈ దాడిలో పట్టుబడినవి అన్నీ కూడా క్వార్టర్ విస్కీ బాటిల్స్ కావడం విశేషం. మొత్తం 9,200 బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు కారణం అయిన నలుగురిని అరెస్ట్ చేశారు.