ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళగా సరోజ నిలిచారు. ప్రధాన టైటిల్‌తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’, ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డులు’ కూడా సొంతమయ్యాయి. అల్లూరి సరోజ ఫైనల్‌కు ముందు జరిగిన వివిధ రౌండ్లలో పోటీ పడ్డారు. తన విభాగంలో గ్రాండ్ ఫినాలేలో ‘నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్’, ఈవెనింగ్ గౌన్ రౌండ్’ అనే రెండు పోటీ రౌండ్లలో అత్యధిక స్కోర్ చేశారు.
అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజ.. తన భర్త, ఏడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెతో కలిసి లాస్ఏంజెల్స్లో నివసిస్తున్నారు. ఆమె వైజాగ్‌లో పుట్టి పెరిగారు. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం AT&T కంపెనీలో టెక్నాలజీ లీడర్‌గా పని చేస్తున్నారు.