Visakha Earthquake: విశాఖపట్టణంలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
Visakha Earthquake: విశాఖపట్టణంలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
Visakha Earthquake: విశాఖపట్టణంలో భూప్రకంపనలు కలకలం రేపాయి. నగరంలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
విశాఖ నగరంలో పలుచోట్ల ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. 7 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
అక్కయ్యపాలెం, మురళీనగర్, బీచ్ రోడ్డు, కంచరపాలెం, మధురానగర్, తాడిచెట్లపాలెం, సీతమ్మధార, పెందుర్తి,సింహాచలం, అల్లిపురం, బంగారమ్మమెట్ట, వేపగుంట, బాలయ్య శాస్త్రి లేఅవుట్ భూప్రకంపనలు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
ఐతే భూకంప కేంద్రం ఎక్కడుంది? తీవ్రత ఎంత? అనే వివరాలు తెలియాల్సి ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ నుంచి కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
భూమి కంపించడంతో విశాఖ నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఐతే ఇవి స్పల్ప భూప్రకంపనలే అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
అనధికారిక సమాచారం ప్రకారం..విశాఖలోని గాజువాకకు ఈశాన్య దిశగా 8.9 కి.మీ. దూరంలో.. భూమికి 10 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత 3.2గా ఉండవచ్చని భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)