Oxygen On Wheels: ఏపీలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’... యువ ఎంపీ వినూత్న ఆలోచన
Oxygen On Wheels: ఏపీలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’... యువ ఎంపీ వినూత్న ఆలోచన
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఆక్సిజన్ (Oxygen) అత్యవసరం అవుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ (YSRCP MP Margani Bharath) వినూత్న ఆలోచన చేశారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైరస్ సొకిన వాళ్లకు ఆక్సిజన్ అత్యవసరం అవుతోంది. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క చనిపోతున్నవారు చాలా మంది ఉన్నారు.
2/ 8
ఇప్పటికీ కొంతమంది కరోనా రోగులు ఆటోలు, ఆంబులెన్సుల్లో ఆక్సిజన్ కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది.
3/ 8
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వినూత్న ఆలోచన చేశారు. ఆర్టీసీ బస్సులనే ఐసీయూలుగా మార్చారు.
4/ 8
రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ‘‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’’ పేరుతో రెండు ఆర్టీసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేశారు.
5/ 8
36 సీట్లు సామర్థ్యం గల ఈ బస్సులో ఆరు పడకలను ఏర్పాటు చేశారు. రెండు బస్సులను సిద్ధం చేయగా వాటిలో మొత్తం 12 బెడ్లు అందుబాటులో ఉంటాయి. వీటికి ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేసి మినీ ఐసీయూలా తయారుచేశారు.
6/ 8
ఆసుపత్రిలో బెడ్ లేక ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడేవారికి బెడ్ దొరికేవరకు ఈ బస్సులో ఉంచి ఆక్సిజన్ అందించనున్నారు.
7/ 8
చాలామంది ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు రూపకల్పన చేసినట్టు ఎంపీ భరత్‌రామ్ తెలిపారు.
8/ 8
కోవిడ్ బాధితులకు బస్సులో వైద్యమందించే విధానం విజయవంతమైతే ఎంపీ భరత్‌రామ్ దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.