వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కవులూరుకు చెందిన కంచర్ల అహల్య.. విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలోని బంధువుల ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సొంగా శశి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ బంధువులే. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే ఇటీవల శశికి అహల్యకు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శశి కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు అహల్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే గతంలో కడప నగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. ఐతే ఉన్నట్లుండి అమ్మాయి గుర్తుతెలియని ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడి వేధింపులతే తమ కుమార్తె చనిపోయినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. (ప్రతీకాత్మకచిత్రం)