ఈ రోజుల్లో తెలిసివాడని లేదు.. తెలియనివాడని లేదు. దగ్గరి వాళ్ల నుంచి కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పరిచయస్తులు, బంధువులు, స్నేహితులు ఇలా పరిచయాలు, వరుసలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
పరిచయస్తుడైన ఓ యువకుడ్ని నమ్మి అతడి బైక్ ఎక్కిన యువతి అతడు పాడుబుద్ధితో చూశాడు. కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం అమీనాపురం గ్రామానికి చెందిన ఓ మతగురువు మనవడకి.. గన్ననరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పరిచయముంది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
ఆ యువతి హనుమాన్ జంక్షన్ లో చదువుకుంటూ బంధువుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో యువతికి ఫోన్ చేసిన యువకుడు తాను గన్నవరం బస్టాండ్ వద్ద ఉన్నానని.. కలుద్దాం రమ్మని పిలిచాడు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
దీంతో ఆమె గన్నవరం వెళ్లింది. అక్కడి నుంచి యువతిని బైక్ పై ఎక్కించుకొని చినవుటపల్లి శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను కొట్టి అత్యాచారానికి యత్నించాడు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టకి తీసుకెళ్లింది. దీంతో వారు ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడ్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)