Vijayawada Woman Wins Mrs India 2021 Title: బెజవాడ అమ్మాయి మరో సారి మెరిసింది. అందాల పోటీలు జరిగి.. అక్కడ బిల్లుపాటి మల్లిక ఉంటే.. కిరీటం తనదే అనే ముద్ర వేసుకుంది. ఇక ఎవరైనా రన్నరప్ కోసం మాత్రమే పోటీ పడాలి అనే చేస్తోంది. పెళ్లైన తరువాత అందం.. ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తూ వరుస టైటిళ్లు సొంతం చేసుకుంటోంది..
దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. రౌండ్ల వారిగా ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. అన్ని ప్రిలిమినరీ రౌండ్ల తరువాత ఫిల్డర్ చేయగా.. 12 మంది మాత్రమే టైటిల్ బరిలో నిలిచారు. తాజాగా జరిగిన తుది విడత పోటీల్లో వారందరినీ వెనక్కు నెట్టి మిసెస్ ఇండియా కిరీటం కైవసం చేసుకున్నారు మల్లిక.
మల్లిక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం.. విజయవాడకు చెందిన ఆమె తండ్రి పేరు సుంకర దుర్గాప్రసాద్. ఎంబీఏ పూర్తి చేశారు. 2019లో ‘శ్రీమతి అమరావతి’ టైటిల్ గెల్చుకున్నారు. ఆతర్వాత 2020లో వర్చువల్‌గా నిర్వహించిన ‘మిసెస్ ఏపీ’ అందాల పోటీల్లో సెకెండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 19వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.