VIJAYAWADA WOMAN HAD EXTRAMARITAL AFFAIR WITH TWO MEN AT THE SAME TIME ONE OF THE COMMIT SUICIDE IN WEST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Affair: ఒకేసారి ఇద్దరితో మహిళ ఎఫైర్... ఓ రోజు ఆ ఇద్దరూ ఎదురుపడ్డారు.. తర్వాత ఏం జరిగిందంటే..!
ఓ మహిళ ఒకే సమయంలో ఇద్దరు పురుషులతో సంబంధం కొనసాగించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో వ్యవహారం నడిపింది. ఓ రోజూ మహిళ ఇంటి సమీపంలో వాళ్లిద్దరూ ఎదురుపడటంతో కథ ఊహించని మలుపు తిరిగింది.
ఈ రోజుల్లో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. వివాహ బంధానికంటే అక్రమ సంబంధాలకే విలువిచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతకాలం గుట్టుగా నడిపిన బంధాలైనా..? ఎప్పుడోఒకసారి రట్టుకాక తప్పదు. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
ఓ మహిళ ఒకే సమయంలో ఇద్దరు పురుషులతో సంబంధం కొనసాగించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో వ్యవహారం నడిపింది. ఓ రోజూ మహిళ ఇంటి సమీపంలో వాళ్లిద్దరూ ఎదురుపడటంతో కథ ఊహించని మలుపు తిరిగింది. చివరకి ఒకరి ప్రాణాలు బలిగొంది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం నాగులపల్లికి చెందిన గూడవల్లి శ్రీనివాస్ కు పంగిడిగూడెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధముంది. ఐతే సదరు మహిళ అప్పటికే అనుమాలగూడెంకు చెందిన అప్పరావు అనే మరో వ్యక్తితో ఎఫైర్ నడుపుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
ఇదిలా ఉంటే ఈ ఏడాది అక్టోబర్ 19న శ్రీనివాస్ మహిళను కలిసేందుకు పంగిడి గూడెం వెళ్లాడు. ఐతే ఈ విషయాన్ని అప్పటికే తెలుసుకున్న అప్పారావు.. శ్రీనివాస్ కోసం కాపుకాశాడు. అక్కడికి రాగానే అప్పారావు.. శ్రీనివాస్ పై దాడి చేశాడు. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
గొడవ జరగడంతో పంచాయతీ గ్రామ పెద్దల వరకు వెళ్లించది. విచారణ జరిగిన గ్రామ పెద్దలు లావూరి చిన వెంకన్న, లావూరి సుబ్బారావు, బనావత్తు దుర్గారావు.. శ్రీనివాస్ కు రూ.70వేలు, అప్పారావుకు రూ.50వేల జరిమానా విధించారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
జరిమానా కట్టాలని ఒత్తిడి చేస్తుండటంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్.. కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న ద్వారకా తిరుమల పోలీసులు పంగిడి గూడెంలో గ్రామ పెద్దలను అదుపులోకి తీసుకున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)