AP Lockdown: మూడు రోజులు కంప్లీట్ లాక్ డౌన్... షాపులు కూడా ఉండవు.. బీ కేర్ ఫుల్
AP Lockdown: మూడు రోజులు కంప్లీట్ లాక్ డౌన్... షాపులు కూడా ఉండవు.. బీ కేర్ ఫుల్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా వైరస్ (Corona Virus) విజృంభిస్తున్న వేళ అధికారులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. లాక్ డౌన్ (Lockdown) తప్ప మరో ఆప్షన్ లేదనే విధంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
2/ 7
కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతాల వారీగా కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి కఠిన ఆంక్షలు విధించారు.
3/ 7
ఇటు కృష్ణాజిల్లాలోనూ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న మండలాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు.
4/ 7
కృష్ణాజిల్లా కోడూరు మండలంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉండటంతో మూడు రోజుల పాటు కంప్లీట్ లాక్ డౌన్ విధిస్తున్నట్లు మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రకటించింది. ఆది, సోమ, మంగళవారాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో తహసీల్దార్ షేక్ లతీఫ్ పాషా ప్రకటించారు.
5/ 7
సంపూర్ణ లాక్ డౌన్ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం పాల వ్యాపారాలకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తేల్చి చెప్పారు.
6/ 7
వ్యాపారస్తులు సైతం సంపూర్ణ లాక్ డౌన్ కు పూర్తి మద్దతు తెలిపారని, నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
7/ 7
నిత్యవసర వస్తువులు, కూరగాయలు కావలసినవారు శనివారమే సమకూర్చుకుని, ప్రజలందరూ మూడురోజులపాటు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు కోరారు.