Navaratri 2022: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక శ్రీ దేవి శరన్నవరాత్రులు అంటే ఇంకా ప్రత్యేకంగా నిలుస్తాయి.. ఇసుక వేస్తే రాలనంత జనం ఇక్కడ కనిపిస్తారు. మరి ఈ ఉత్సవాల్లో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఇష్టమైన రంగులు ఏంటి..? నైవేద్యం ఏం పెడతారు. వాటి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం.
1వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి.
26వ తేదీ సోమవారం.. అమ్మవారి ఉత్సవాల్లో ఇదే తొలి రోజు.. ఈ రోజున బెజవాడ కనకదుర్గ అమ్మవారు.. శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవి (Durga devi) గా భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ రోజు అమ్మను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి. ఎందుకంటే ఎరుపు ఉత్తేజానికి సంకేతం అంటారు. అలాగే నైవేధ్యం కట్టు పొంగలి, చలిమిడి , వడపప్పు , పాయసం పెట్టాలి. ఎందుకంటే ఈ పదార్థంలోని మిరియాలు భూత, ప్రేత పిశాచాలను తరమడానికి నైవేద్యంగా పెడతారని పండితులు చెప్పే మాట.
2వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ విదియ..
27వ తేదీ రెండో రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. అమ్మకు లేత గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. బంగారు రంగు పాజిటివ్ ఎనర్జి తీసుకువస్తుందన్నది భక్తుల నమ్మకం. ఇక నైవేద్యంగా పులిహోరను పెట్టాలి. దీన్ని చిద్రాన్నం అని కూడా అంటారు. దీన్ని ద్వార సకల దోషాలు పోతాయని పండితులు చెబుతారు.
3వ రోజు...ఆశ్వీయుజశుద్ధ తదియ..
28వ తేదీ మూడో రోజు.. బెజవాడ కనకదుర్గా మాతను.. గాయత్రీదేవిగా అలంకరిస్తారు.
కాషాయ లేదా నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే ఈ రంగు ఆటంకాలను తొలగించి.. విజయాలను చేకూరుస్తుంది. కొబ్బరి అన్నాన్ని, పాయసాన్ని నైవేధ్యంగా పెడతారు. ఎందుకంటే పూర్ణఫలాన్ని పొందడానికి ఈ నైవేద్యాన్ని పెడతారన్నది పండితుల మాట.
4వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ చవితి..
29వ తేదీ.. నాలుగో రోజు.. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈ దేవికి
గంధపు రంగు లేదా పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఈ రంగు ఇచ్చే గుణానికి సంకేతం. కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతోనే సమస్త జీవులకు ఆహారం చేకూరుతుంది. ఆ తల్లి అన్ని జీవరాసులకు ఆహారాన్ని ఇస్తుంది. అల్లం గారెలు, దద్దోజనం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి. అమ్మను శాంతపరచడానికి గారెలను పెట్టాలన్నది భక్తుల నమ్మకం.
5వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ పంచమి..
30వ తేదీ ఐదో రోజు.. అమ్మవారికి అంత్యంత ప్రీతకరమైన రోజుల్లో ఒకటి.. పంచమి రోజున కనక దుగ్గ తల్లి.. లలితా సుందరీ దేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి కుంకమ, ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. దద్ధోజనం కేసరిబాత్ నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే సకల కార్యసిద్ధికి ఈ నైవేద్యాన్ని పెట్టాలి.
6వరోజు.. ఆశ్వీయుజ శద్ధ షష్టి
అక్టోబర్ 01వ తేదీ ఆరో రోజు.. కనక దుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా అలంకరిస్తారు. గులాబీరంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంచడానికి. కదంబం, చక్కర పొంగలితో పాటు క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే.. సకల ఆహార పదార్థాలను అమ్మవారికి పెట్టవచ్చు అన్నది భక్తుల నమ్మకం..
7వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ సప్తమి..
అక్టోబర్ 02వ తేదీ.. ఏడో రోజు అమ్మవారు సరస్వతిదేవిగా అలంకరిస్తారు. తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై ఉంటుంది. ఈ దవళవస్త్రం మానసిక పరిపక్వతతోపాటు సకల విద్యలకు నిదర్శనం. దద్దోజనం, కేశరి నైవేద్యంగా పెట్టాలి. పిల్లలకు చదువు బాగా రావాలని ఈ నైవేద్యం పెడతారు.
8వ రోజు.. అశ్వీయుజ అష్టమి
అక్టోబర్ 03వ తేదీ.. ఎనిమిదవ రోజు దుర్గాష్టమి.. అమ్మవారు దుర్గారవీ రూపంలో దర్శనమిస్తారు. ఆకుపచ్చ, ఎరుపు రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరించాలి. దుర్గాదేవి బుద్ధికి నిదర్శనం. అమ్మవారికి చక్కెరపొంగలి, కదంబం, శాకాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే.. మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది.
చివరిగా విజయదశమి..
ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. బంగారు రంగు, ఆకుపచ్చ వస్త్రంతో అలంకరించాలి. ఇది శుభానికి సంకేతం. పులిహోరా, బూరెలు, గారెలు, పాయసం అన్ని అమ్మవారికి పెట్టవచ్చు. ఎందుకంటే విజయదశమిరోజు అపరాజితగా నిలిచింది. ఇక అమ్మవారు ఏ రంగు వస్త్రం ధరిస్తుందో ఆ వస్త్రం మనం కూడా ధరిస్తే.. సకల శుభాలు కలుగుతాయి.