కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందు, అపార్ధాలు భార్యాభర్తల బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో కట్టుకున్నవాళ్లను, కన్నబిడ్డలను చేజేతులా చంపుకుంటున్న ఘటనలు ప్రతి రోజూ వెలుగు చూస్తున్నాయి.
2/ 6
ఆర్ధిక ఇబ్బందులు, భార్యతో గొడవల కారణంగా ఓ వ్యక్తి కన్నబిడ్డలను కట్టుకున్నభార్యను దారుణంగా హత్య చేశాడు.
3/ 6
వివరాల్లోకి వెళ్తే... విజయవాడ వాంబే కాలనీలోని డి బ్లాంక్ లో మోహన్, నీలవేణి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మోబన్ భారీగా అప్పులు చేయడంతో పాటు తరచూ భార్యతో గొడువ పడుతుండేవాడు.
4/ 6
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మోహన్.. భార్య, పిల్లలను హత్య చేసి పరారయ్యాడు. ఉదయం ముగ్గురూ రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు.
5/ 6
మరోవైపు హత్యల అనంతరం ఇంటి నుంచి పారిపోయిన మోహన్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. రైలు సమీపిస్తుండగా భయంతో పక్కకు దూకేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
6/ 6
ప్రస్తుతం అతడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.