రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలి-చంద్రబాబు
ఎక్కడ చూసినా జగన్ పాలన అంతా విధ్వంసమే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడిపై తప్పుడు కేసు పెడితే ఏమైందని అడిగారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జగన్ తండ్రి పేరుతో జిల్లా పేరు ఉంటే మేము మార్చామా..? కానీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు జగన్ మార్చారన్నారు..? జగన్ బటన్ ఇన్ కార్యక్రమం పెట్టుకున్నారని.. సాయంత్రం అవ్వగానే తన ఆదాయంపై లెక్కలు మొదలు పెడతారని.. రానున్న రోజుల్లో కోడికత్తి లాంటి డ్రామాలు జగన్ చాలా ఆడుతారన్నారు. అందుకే మనం అలర్ట్ గా ఉండాలి అన్నారు చంద్రబాబు నాయుడు..