Vijayawada: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ నుంచి ఈ రైళ్లు రద్దు..!
Vijayawada: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ నుంచి ఈ రైళ్లు రద్దు..!
Vijayawada: విజయవాడ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దు చేసింది.మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గుంటూరు డివిజన్ పరిధిలో న్యూ గుంటూరు- నంబరూ స్టేషన్ల మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా.. విజయవాడ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని పాక్షికంగా రద్దవగా.. పలు రైళ్లను దారి మళ్లిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
విజయవాడ - గుంటూరు ప్యాసింజర్ రైలు ( 07464), గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైలు (07465).. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10 వరకు రద్దు చేస్తున్నట్లు SRC తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
హుబ్లి-విజయవాడ ఎక్స్ప్రెస్ రైలు (17329)ను.. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 9 వరకు.. గుంటూరు-విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు గుంటూరు వరకే నడుస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
విజయవాడ-హుబ్లి ఎక్స్ప్రెస్ రైలు (17330)ను.. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10 వరకు.. విజయవాడ-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ రైలు గుంటూరు నుంచి బయలుదేరుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (12706) రైలును.. ఫిబ్రవరి 9న విజయవాడ-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు SCR తెలిపింది. ఇది విజయవాడ వరకే వెళ్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (12705) రైలును.. ఫిబ్రవరి 10న గుంటూరు-విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది విజయవాడ నుంచి బయలుదేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
గుంటూరు-విజయవాడ (07979) రైలును.. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10 వరకు.. చెన్నై-విజయవాడ (12077) రైలును ఫిబ్రవరి 9 నుంచి 10 వరకు.. తెనాలి-క్రిష్ణ కెనాల్ మీదుగా దారిమళ్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)