ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం.. వచ్చే నెల 23 నుంచి ప్రారంభంకానుంది. రంజాన్ సీజంలో ముస్లింలు ఉపవాసం ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటలుపాటు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ ఊరట కలిపించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ముస్లిం ఉద్యోగులు విధుల నుంచి ఓ గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు, టీచర్లు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాల ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు నెల రోజుల పాటు ఈ వెసులుబాటును కల్పించింది ఏపీ సర్కార్. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)