Vijayawada Railway Station: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. సెప్టెంబర్ 30 నుంచి భారీ ఊరట..

విజయవాడ రైల్వే డివిజన్‌కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ముందు జాగ్రత్య చర్యల్లో భాగంగా పెంచిన రైల్వే ప్లాట్‌ఫారమ్ టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 30 నుంచి విజయవాడ డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టికెట్ ఛార్జీ రూ.10 రూపాయలుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.