Pawan kalyan: నేటి నుంచి 4 రోజుల పాటు విజయవాడలో పవన్ కల్యాణ్
Pawan kalyan: నేటి నుంచి 4 రోజుల పాటు విజయవాడలో పవన్ కల్యాణ్
Janasena: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నాలుగు రోజుల పాటు విజయవాడలోనే ఉండనున్నారు. జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో నగరానికి వస్తున్నారు జనసేనాని.
2/ 6
జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు విభాగాల నేతలతో ఆయన ప్రత్యేకంగా ముందుగా సమావేశం కానున్నారు.
3/ 6
ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు బీసీ సంక్షేమంపై జనసేన పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. 12న ఉదయం పార్టీ నాయకులతో సమీక్ష చేస్తారు. కొత్తగా పార్టీలో చేరే వారిని జనసేనలోకి ఆహ్వానిస్తారు.
4/ 6
అదే రోజు చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలోని కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ భేటీ అవుతారు. 13వ తేదీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
5/ 6
మార్చి 14వ తేదీన ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనంపై యాత్రగా పవన్ కల్యాణ్ బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నం సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
6/ 6
మొత్తంగా నాలుగు రోజుల పాటు పవన్ కల్యాణ్ మంగళగిరిలో అందుబాటులో ఉండడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవాడ నగరానికి తరలివస్తున్నారు.