జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. మూడు నెలల తర్వాత విజయవాడ పర్యటనకు వచ్చారు.
2/ 11
తిరుపతి ఉపఎన్నిక ప్రచారం తర్వాత కరోనా సోకడంతో ఇంటివద్దే పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పటి నుంచి పార్టీ సమావేశాలుగానీ, కార్యక్రమాలు గానీ నిర్వహించలేదు.
3/ 11
పవన్ పూర్తిస్థాయిలో కోలుకోవడంతో పార్టీ బలోపేతం, ఇతర కార్యక్రమాలపై దృష్టిపెట్టారు.
4/ 11
ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
5/ 11
పార్టీ నేతలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు.
6/ 11
ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.