తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) గుడ్ న్యూస్ చెప్పింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని 100 ప్రత్యేక రైళ్ల (Special Trains) ను విజయవాడ (Vijayawada) మీదుగా నడపనున్నట్లు ప్రకటించింది. రెండు నెలల పాటు ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. (ప్రతీకాత్మకచిత్రం)
ట్రైన్ నంబర్ 07091 కాజీపేట నుంచి తిరుపతి వరకు, ట్రైన్ నంబర్ 07092 తిరుపతి నుంచి కాజీపేట వరకు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం నడుపుతారు. ట్రైన్ నంబర్ 07185 మచిలీపట్నం-సికింద్రాబాద్, 07186 సికింద్రాబాద్-మచిలీపట్నం, మధ్య నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రతి ఆదివారం నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)