తగ్గిన ఛార్జీలు ఈనెల 30వ తేదీ వరకు అమలులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. అయితే రూట్లు, చార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయం ఆర్ఎంలకు అప్పగించింది. విజయవాడ-హైదరాబాద్ ఏసీ బస్సులో 10 శాతం ఛార్జీలు తగ్గించింది. అమరావతి, గరుడ, వెన్నెల బస్సు ఛార్జీల్లో 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గించారు.
విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గించింది. అయితే అమరావతి, వెన్నెల బస్సుల్లో శుక్ర, ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఛార్జీలు తగ్గించారు. రూట్లు, ఛార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయం ఆర్టీసీ రీజినల్ మేనేజర్(RM)లకు అప్పగించింది. ఈనేపథ్యంలో ఛార్జీల తగ్గింపుపై ఆయా జిల్లాల ఆర్టీసీ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.
అయితే ఈ తగ్గింపు ప్రధాన కారణం.. భారీగా రేట్లు పెరగడంతో.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గువగా ఉంటోంది. కేవలం వీకెండ్స్ మినహా మిగిలిన రోజుల్లో ఏసీ బస్సులను ప్రిఫర్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది.. అంత ఖరీదు పెట్టి.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడం కన్నా.. ప్రైవేటు బస్సులనే ఎంచుకుంటున్నారు. దీంతో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10గా ఉండగా.. తొలి 30 కిలోమీటర్ల వరకు ఎలాంటి పెంపు లేదని (Diesel Cess) ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. 35 కి.మీ. నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5 సెస్ విధిస్తున్నట్లు తెలిపింది. ఇక 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10, వంద కిలోమీటర్లు ఆపైన రూ.20 సెస్ విధించారు.
ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5 చొప్పున సెస్ వసూలు చేస్తున్నారు. ఇక సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై 10 చొప్పున సెస్ వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో తొలి 55 కి.మీ. వరకు సెస్ పెంపు లేదు. 56 కి.మీ., ఆపైన దూరాన్ని బట్టి రూ.70 నుంచి రూ.100 వరకు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు.
విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ , విజయవాడ-చెన్నై, విజయవాడ-బెంగళూరు వెళ్లే ఏసీ బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గించారు. అయితే ఈ ధరలు శుక్రవారం, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో అమల్లో ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ సూచించింది. అయితే ఈ తగ్గింపు తాత్కాలికమే అని చెప్పండంతో.. మళ్లీ రేట్లు పెరిగే అవకాం ఉందని ఆందోళ వ్యక్తం చేస్తోంది.