ఈ రోజుల్లో కాలేజీ స్నేహాలు, ప్రేమలు సర్వసాధారణమయ్యాయి. అలా మొదలైన ప్రేమలు కొన్ని పెళ్లిళ్ల వరకు వెళ్తుండగా.. మరికొన్ని తప్పుడు మార్గంలో పయనిస్తున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 8
అలా కాలేజీలో మొదలైన ప్రేమ వ్యవహారం మధ్యలోనే ముగియడంతో ఓ యువతి పరువు ఇంటర్నెట్ పాలైంది. బ్రేకప్ చెప్పిందన్న కోపంతో యువకుడు ఆమె పర్సనల్ వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్లో వైరల్ చేశాడు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 8
వివరాల్లోకి వెళ్తే.., విజయవాడలోని ఓ ప్రముఖ కాలేజీలో ఓ యువతి డిగ్రీ చదువుతోంది. ఆమెకు అదే కాలేజీలో చదువుతున్న రోహిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 8
తొలుత స్నేహం పేరుతో యువతికి దగ్గరైన రోహిత్.. ఆ తర్వాత ప్రేమిస్తున్నాని చెప్పాడు. అప్పటికే అతడి స్నేహానికి ఆకర్షితురాలైన యువతి ప్రేమకు అంగీకరించింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 8
ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పడంతో తన నగ్నవీడియోలు, ఫోటోలను రోహిత్ కు పంపింది. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 8
ఐతే ఇటీవల ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో యువతి.. రోహిత్ కు బ్రేకప్ చెప్పింది. దీంతో రోహిత్ కుమార్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. (ప్రతీకాత్మకచిత్రం)
7/ 8
యువతికి సంబంధించిన న్యూడ్ ఫోటోలు, వీడియోలను తన ఫ్రెండ్ అయిన దండగల గణేష్ అనే యువకిడికి షేర్ చేశాడు. అతడు ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఆమె ఫోటోలు, వీడియోలను షేర్ చేశాడు. (ప్రతీకాత్మకచిత్రం)
8/ 8
విషయం తెలుసుకున్న బాధిత యువతు తనకు న్యాయం చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు రోహిత్ తో పాటు అతడి స్నేహితుడు గణేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాడు. (ప్రతీకాత్మకచిత్రం)