ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై మక్కువ పెరిగింది. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటలకు గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో బ్లాక్ రైస్ పేరును చాలా మంది జపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బ్లాక్ రైస్ సాగు పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో బ్లాక్ రైస్ సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. (Photo: Facebook)
ప్రస్తుతం కృష్ణాజిల్లాలో దాదాపు 30 ఎకరాల్లో బ్లార్ రైస్ సాగవుతోంది. ముఖ్యంగా గూడూరు మండలం పీజీలంక, తుమ్మలపాలెం, బంటుమిల్లి మండలం తుమ్మిడి, ఆగిరిపల్లి మండలం వడ్లమాను, కలిదిండి మండలం కోరుకొల్లు తదితర ప్రాంతాల్లో బ్లాక్ రైస్‌ను సాగు చేస్తున్నారు. వీటిలో కర్పుకవని, బర్మా బ్లాక్, కాలాభట్ రకాలను సాగు చేస్తున్నారు. (Photo: Facebook)
మరోవైపు బ్లాక్ రైస్‌కు పెట్టుబడి కూడా తక్కువే అవుతుంది. సాధారణ రకం వరికి ఎకరానికి రూ.28–30 వేల వరకు పెట్టుబడి అవసరం కాగా బ్లాక్ రైస్‌కు రూ.20 వేలు సరిపోతుంది. చౌడు నేలలు తప్ప మాగాణి నేలల్లో ఈ పంటకు వీలవుతుంది. సాధారణ వరి 120–130 రోజుల్లో పంట చేతికి వస్తే బ్లాక్ రైస్‌కు 140–150 సమయం పడుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)