తాజాగా అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. అంటే ఇకపై పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటును తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయంతో పాత వాహనదారుల జేబుకు చిల్లు పడనుంది. ఈ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల
ద్వారా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకు అదనంగా 500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.
ఈ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఎందుకు..?
అన్నిటికన్నాముఖ్యంగా పెరుగుతున్న వాహన ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యం.. దీనికి తోడు అధికమవుతున్న చోరీలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ముందు దుండగులు వాహనాల నంబర్ ప్లేట్లను మార్చుతున్నారు. కొన్ని సందర్భాల్లో
గుర్తించకుండా కాల్చేసి సాక్ష్యాలు దొరక్కుండా చేస్తున్నారు.
ఇలాంటి నేరాలు.. ఘోరాలు అన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు రవాణాశాఖ హైసెక్యూరిటీ నంబర్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. వీటిద్వారా కొంత వరకైనా అసాంఘిక కార్యకలాపాలను ఆపాలని సంకల్పించింది. మరి ఈ నిర్ణయం ఎంత వరకు కఠినంగా అమలవుతుందో చూడాలి.
ఎందుకంటే గతంలో చాలా ఆదేశాలు ఇచ్చినా అవి కాగితాలకే పరిమితం అయ్యాయి.