మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. ఇక భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు అర్హులైన వారు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి అర్హులైన వారు అవసరమైన ధ్రువపత్రాలతో పాటూ ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలకు సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు ఇస్తారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీకి చెందిన అమ్మాయిలు కులాంతర వివాహం చేసుకుంటే వారికి లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇస్తారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే 50 వేలు ఇస్తారు. ఒకవేళ వారు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 75 వేలు కానుకగా ఇస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు మాత్రమే అర్హులు. పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారికి ఈ పథకాలు వర్తిస్తాయి. ఎవరికైనా సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు. కానీ ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపు ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా ఈ పథకానికి అనర్హులు. విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలనే నిబంధన కూడా ఉంది. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి ఉండొద్దు. ప్రభుత్వం పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఇచ్చారు. వారు ఈ పథకానికి అర్హులే. (ప్రతీకాత్మక చిత్రం)