ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడ వాసుల చిరకాల స్వప్నం నిజం కాబోతోంది. కృష్ణలంక రిటైనింగ్ వార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కృష్ణలంకలోని కనకదుర్గ వారధి సమీపంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 1.5 కిలోమీటర్ల మేర రూ. 122.90 కోట్ల'తో కృష్ణా నది వరద ఉద్ధృతిని తట్టుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వర్ నగర్ వరకు వాల్ నిర్మాణం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.