Tollywood meet CM Jagan: టాలీవుడ్ పెద్దలకు శుభవార్త చెప్పేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. సుదీర్ఘ కసరత్తు తరువాత..ఏపీలో టికెట్ల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురానున్నారు. సినీ పెద్దలను మరీ ఇబ్బంది పెట్టకుండా..సామాన్య జనాల నుంచి వ్యతిరేకత రాకుండా.. టికెట్ల వ్యవహారంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నది ఆయన సన్నిహితుల మాట..
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేటు నిర్ధారించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తరువాత.. టికెట్ల రేట్లను ఫైనల్ చేసి.. ఆ నివేదిక ఇప్పటికే సీఎం జగన్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది. గురువారం సినిమా పెద్దలతో సీఎం జగన్ భేటీలో.. ఈ కమిటీ నివేదికపై ఇప్పుడు తుది చర్చలు జరుగుతాయని.. ఈ సమావేశంలోనే టికెట్ల రేట్లపై అధికారికంగా సీఎం జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
తాజాగా సినిమా రెట్ల వ్యవహారానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై సీఎం జగన్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా సినిమా ఇండస్ట్రీ సమస్యలపై స్టడీ చేయాలని మంత్రి పేర్నినాని, సుదీర్ఘంగా సినిమా టికెట్ల ధరలపై చర్చించారు. ఈ సమావేశంలోనే టాలీవుడ్ పెద్దలు వస్తే ఏం మాట్లాడాలి.. ఏం చేయాలి అన్నదిపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం..
[caption id="attachment_1197300" align="alignnone" width="773"] టాలీవుడ్ పెద్దలతో మీటింగ్ కంటే ముందే సినిమా టికెట్లపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని.. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రేట్లను నిర్ణయించారని.. టాలీవుడ్ పెద్దలతో మీటిం
కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో రెండు కీలక అంశాలు సినీ వర్గాలకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఒక అంశం ఏమో రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వమని చెప్పడం. అలాగే ఆ రెండో అంశం ఏమిటంటే జీవో నెంబర్ నెంబర్ 35 ప్రకారం థియేటర్లను మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీలుగా విభజించారు. కానీ కమిటీ మాత్రం ఈ విభజనలు వద్దని సలహా ఇచ్చింది. దీంతో టాలీవుడ్ పెద్దల డిమాండ్ కొంత వరకు అంగీకరించినట్టే అవుతుంది.