ఐతే చివరి నిముషంలో కేబినెట్ సమావేశం వాయిదా పడటం చర్చనీయాంశమవుతోంది. సచివాలయంలో కరోనా కేసుల కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత మీటింగ్ సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉంటుందన్న ప్రచారం కూడా జరిగింది. చివరకు సెక్రటేరియట్ లోనే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.