విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. (Twitter Photo)
2/ 12
ఇప్పటికే ఆలయ అధికారులు ఇంద్రకీలాద్రిపై విజయదశమి ఉత్సవాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రతి రోజూ పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించేలా ప్రణాళికలు రూపొందించారు. నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో అలంకరణలో దర్శనమిస్తారు.
3/ 12
07.10.2021న తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.
4/ 12
08.10.2021న రెండవ రోజు శ్రీ బాలాత్రిపుర సందరి దేవిగా అలంకరిస్తారు.
5/ 12
09.10.2021న మూడవ రోజు శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు.
6/ 12
10.10.2021న నాలుగోరోజు శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తుంది.
7/ 12
11.10.2021న ఐదవ రోజు ఉదయం 4గం.ల నుంచి మధ్యాహ్నం 12గం.ల వరకు శ్రీ అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు.
8/ 12
11.10.2021న 5వ రోజు మధ్యాహ్నం 2గం.ల నుంచి రాత్రి 10గం.ల వరకు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు.
9/ 12
12.10.2021న 6వ రోజు శ్రీ సరస్వతి దేవీ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వంతరపున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
10/ 12
13.10.2021న ఏడవ రోజు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు.
11/ 12
14.10.2021న ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసురమర్ధినీ దేవిగా దుర్గమ్మను అలంకరిస్తారు.
12/ 12
15.10.2021న విజయదశమినాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.