భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్యభక్తుడిలా వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి శ్రీవారి దర్శనానికి ఆయన వెళ్లారు. ప్రజలు సుఖశాంతులతో జీవించేందుకు కావలసిన శక్తిని ఇవ్వమని, ప్రకృతి సహకరించాలని, సకాలంలో వర్షాలు కురిసి, ప్రకృతి వైపరిత్యాలు లేకుండా రైతులకు మేలు కలగాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.