మొత్తం ఏసీతో ఉండే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లో మొత్తం 1128 సీట్లు ఉంటాయి. 16 కోచ్‌లతో ఏసీ రైలు నడుపుతున్నారు. చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ రెండు విభాగాల్లో సీట్లు అందుబాటులో ఉంటాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ అయితే సుమారు రూ. 2,100, ఎగ్జిక్యూటివ్ అయితే రూ.3,100 ఉంటుందని అంచనా. ఇక సౌకర్యాలు చూసుకుంటే 52 సెకండ్లలోనే ఈ ట్రైన్ వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.
అన్ని కోచ్‌లలో ఆటోమేటిక్ డోర్లు, GPS ఆధారిత ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , డైవింగ్ ఫ్రెండ్లీ సౌకర్యాలు ఉంటాయి. ఉచిత వైఫై అందుబాటులో ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో తిరిగే కుర్చీలు ఉంటాయి. బయో-వాక్యూమ్ మోడల్ టాయిలెట్లు ఈ ట్రైన్ ప్రత్యేకత. పాంట్రీ సౌకర్యం ఉంది. కావాల్సిన వారికి భోజనం , పానీయాలు అందిస్తారు. దానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
భవిష్యత్తులో సికింద్రాబాద్ తిరుపతి నగరాల మధ్య కూడా మరో వందేభారత్ ట్రైన్ నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందే భారత్ రైళ్లు న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కాట్రా, ముంబై సెంట్రల్-గాంధీనగర్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై సెంట్రల్-మైసూరు మార్గాల్లో నడుస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)