Sukumar Fan: హీరోకు ఫ్యాన్స్ ఉంటారు.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ ఉంటారు.. రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ దర్శకుడికి ఒక హీరో అభిమాని అయితే.. దాని ఫలితం ఎలా ఉంటుందో చేసి చూపించాడు.. ఊహకి అందని విధంగా ఆ దర్శకుడిపై ఉన్న అభిమానాన్ని చేతల్లో చేసి చూపించాడు. దాని కోసం ఆ హీరో పడిన కష్టం అంతా ఇంతా కాదు.
వివరాల్లోకి వెళితే సువీక్షిత్ బొజ్జా అనే యువ హీరో.. త్వరలో ఓ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే అతడికి ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్ (Sukumar)కు వీరాభిమాని. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా నిలిచిన సుకుమార్ పై ఉన్న ప్రేమతో, అభిమానంతో.. ఇప్పటి వరకు ఏ అభిమాని కూడా చేయని ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు.
సుకుమార్ కే క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు ఉంది. అలాంటి సుకుమార్‌పై అభిమాన్ని.. అంతకన్నా క్రియేటివ్ గా చూపించాడు. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో. అయితే ఈ గిఫ్ట్ ఇవ్వడానికి ఆయన 50 రోజులు కష్ట పడ్డాడు.. అతడి కష్టానికి తగ్గ ఫలితమే వచ్చింది.. ప్రస్తుతం అతడు ఇచ్చిన గిఫ్ట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచింది.
అంతేకాదు సుకుమార్ పై పాటను కూడా సిద్ధం చేశాడు.. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ ను కూడా సిద్ధం ఇలా సిద్ధం చేశాడు. సాగుచేసిన పంట భూమిని ఆ రూపానికి తీసుకువచ్చిన తర్వాత.. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంత అభిమానమా అంటూ అంతా షాక్ తింటున్నారు. ఓ హీరో అయ్యి ఉండి.. ఇలా కష్ట పడడం పై ప్రశంసలు జల్లు కురుస్తోంది.