తుపాన్ కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరితో పాటు ఉద్యానపంటలైన అరటి, కొబ్బరి, జీడితోటలు దెబ్బతిన్నాయి. తీరంలో మత్స్యకార గ్రామలు బాగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఇళ్లుకూలి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు కూలిపోయాయి. వాగులు, వంకల పొంగిపొర్లడంతో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో అత్యధికంగా 6.95 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలో 5.6 సెంటీమీటర్లు, విజయవాడలో 5.60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతపురం, విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురిశాయి. (ప్రతీకాత్మకచిత్రం)