తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు సంబంధించిన.. ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 8న విడుదల చేస్తారు. లక్కీ డిప్ ద్వారా విడుదల చేసే ఆర్జిత సేవలకు కూడా రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి(ప్రతీకాత్మక చిత్రం)
కల్యాణోత్సవం, ఉంజల్ సేవ / డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలనకరణ సేవ, చతుర్థశ కలశ విశేష పూజ వంటి ఆర్జిత సేవలకు నేరుగా ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తారు. సుప్రభాత దర్శనం, అష్టదళ పాద పద్మారాధనము, సహస్రనామ అర్చన సేవ, తోమాల సేవ, నిజపాద దర్శనం టికెట్లను మాత్రం లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
లక్కీడిప్ ద్వారా విడుదల చేసే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు.. ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. అదే రోజు మధ్యాహ్నం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా భక్తులకు సేవా టిక్కెట్లు టీటీడీ కేటాయిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన భక్తులు ఆన్లైన్లో నేరుగా బుక్ చేసుకోవచ్చు. టీటీడీ అధికారిక వెబ్సైట్, యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటలకు ఈ టికెట్లను విడుదల చేస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
శ్రీవారి సుప్రభాత సేవ వేకువజామున 3 గంటలకు ప్రారంభం అవుతుంది. తోమాల సేవ మంగళ, బుధ, గురువారాల్లో తెల్లవారుజామున 3.30 గంటలకు మొదలవుతుంది. అదే రోజుల్లో 4.30 గంటలకు అర్చన ప్రారంభమవుతుంది. ఈ సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు టికెట్లతో అరగంట ముందే రిపోర్ట్ చేయాలి. అష్టాదళ పాద పద్మారాధనం మంగళవారం ఉదయం 5.30 గంటలకు మొదలవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)