తాజాగా సిఫార్సు లేఖలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని,అది వారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖల పై కేటాయించే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో శ్రీవారి సేవా టికెట్ల పెంపుపై చర్చ జరిగిన సంగతి తెలిసందే. సిఫార్సు లేఖలపై వచ్చేవారికి సేవా టికెట్ల ధరలు పెంచాలని టీటీడీ ప్రతిపాదించింది. దీనిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని.. సామాన్య భక్తులకు సంబంధించి ధరలు పెంచే ఆలోచన లేదని టీటీడీ స్పష్టం చేసింది.