శ్రీవారి సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సిఫార్సులు, ఆన్ లైన్ సేవలు, శ్రీవాణి ట్రస్ట్, టీటీడీ ఛైర్మన్, పాలక మండలి కోటాలో ప్రతిరోజూ 65వేలకు పైగా టోకెన్లు జారీ చేస్తోంది. ఇప్పటివరకు ప్రతి నెల చివరి వారంలో తర్వాతి నెలకు సంబంధించిన టోకెన్లను మాత్రమే విడుదల చేస్తున్న టీటీడీ.. ఇప్పుడు ఏకంగా మూడు నెలలకు సరిపడా కోటాను విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు సోమవారం నుండి బుధవారం వరకు రోజుకు 30 వేల టిక్కెట్లు, గురువారం నుండి ఆదివారం వరకు రోజుకు 25 వేల టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా, సర్వదర్శనం టోకెన్లను రోజుకు 30 వేల టోకెన్లు చొప్పున ఆఫ్లైన్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు కేటాయిస్తారు.