TTD TO RELEASE OFFLINE FREE DARSHAN TOKENS FROM FEBRUARY 15TH FULL DETAILS HERE PRN TPT
TTD Darshan Tokens:శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈనెల 15 నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు.. ఎక్కడెక్కడ లభ్యమవుతాయంటే..!
సామాన్య భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్ల (Tirumala Darshan Tokens) పై కీలక ప్రకటన చేసింది.
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఆఫ్ లైన్లో సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. (ఫైల్ ఫోటో)
2/ 7
ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవ, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ మేరకు రోజుకు 25వేల నుంచి 30 వేల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. (ఫైల్ ఫోటో)
3/ 7
ఈనెల 15వ తేదీ నుంచి ఆఫ్ లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రోజుకు 15వేల సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాలలో జారీ చేయనుంది. (ఫైల్ ఫోటో)
4/ 7
రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపేసింది. గత ఏడాది రోజుకు 2వేల చొప్పున టికెట్లు జారీ చేసినా.. భక్తుల రద్దీ దృష్ట్యా నిలిపేసింది. (ఫైల్ ఫోటో)
5/ 7
ప్రస్తుతం ఆన్ లైన్లో మాత్రమే రోజుకు 5వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ప్రతి నెల విడుదల చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ కూడా దాదాపు వందశాతం పూర్తవడంతో ఆఫ్ లైన్ టోకెన్ల సంఖ్య పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. (ఫైల్ ఫోటో)
6/ 7
ఐతే ఆఫ్ లైన్లో టోకెన్లు తీసుకునేవారు కూడా కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్, రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు చూపాల్సి ఉంటుంది. అలాగే క్యూలైన్లలో కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. (ఫైల్ ఫోటో)
7/ 7
ఆప్ లైన్లో 15వేల టోకెన్లు జారీ చేస్తుండటంతో ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40వేలు దాటే అవకాశముంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. (ఫైల్ ఫోటో)