కేంద్రం అనుమతి ఇవ్వడంతో... భక్తులకు దర్శన విధివిధానాలపై టీటీడీ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కేంద్రం అనుమతించిన విధంగా తిరుమలలో జూన్ 8 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
జూన్ 1 నుంచి జూన్ 30 వరకు సరికొత్త మార్గదర్శకాలతో లాక్డౌన్ 5 కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ సహా రాష్ట్రాలు కోరిన అనేక మినహాయింపులు ఇచ్చింది.
2/ 9
ప్రార్థనా మందిరాలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో... అందరి దృష్టి టీటీడీపై పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అనుమతిస్తే... అప్పుడు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గతంలోనే స్పష్టం చేశారు.
3/ 9
తాజాగా కేంద్రం ఇందుకు అనుమతి ఇవ్వడంతో... భక్తులకు దర్శన విధివిధానాలపై టీటీడీ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కేంద్రం అనుమతించిన విధంగా తిరుమలలో జూన్ 8 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
4/ 9
రెండు నెలలకు పైగా శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడంతో... టీటీడీ ఆదాయంలో భారీగా కోతపడింది. ఈ నష్టాన్ని ఏరకంగా పూడ్చుకోవాలనే దానిపై టీటీడీ సమాలోచనలు కూడా జరిపింది.
5/ 9
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాల్లో భక్తులకు అనుమతి ఇస్తే.. పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం ఎలా అనే దానిపై టీటీడీ ఇదివరకే కసరత్తు చేసింది.
6/ 9
ప్రతిరోజు 14 గంటలపాటు భక్తులను దర్శనానికి అనుమతించాలని టీటీడీ భావిస్తోంది. గంటకు ఐదు వందల మందికి మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
7/ 9
మొదటి 3 రోజులు టీటీడీ ఉద్యోగులను అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ... ఆ తరువాత 15 రోజుల పాటు స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని భావిస్తోంది. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో రోజుకు 7 వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
8/ 9
ఇక శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారు ముందుగానే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదట సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంచాలని భావిస్తున్న టీటీడీ... టికెట్లు పొందిన భక్తులనే తిరుమలకు అనుమతించాలని యోచిస్తోంది.
9/ 9
ఈ మేరకు అలిపిరి దగ్గర ఏర్పాట్లు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత తక్కువ సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.