కల్యాణకట్టలను 24గంటలు భక్తులకీ అందుబాటులో వుంచుతామన్నారు. విదేశీ భక్తులు సమర్పించిన వివిధ దేశాల కరెన్సీ 30 కోట్ల రూపాయిలు టీటీడీ వద్ద నిల్వ వుందని..2018 లో టీటీడీ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ కాలపరిమితి ముగియ్యడంతో..కొద్దీ సంవత్సరాలు తరువాత ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ కీ దరఖాస్తూ చేస్తే..కేంద్ర హోం శాఖ లైసెన్స్ రెన్యువల్ కోసం 3కోట్ల రూపాయలు ఫైన్ వేసిందని వెల్లడించారు.
కొద్దీ రోజుల క్రిత్తమే అపరాధ రుసుముని చెల్లించమని..త్వరలోనే లైసెన్స్ రెన్యువల్ అవుతుందని..టీటీడీ వద్ద నిల్వ వున్న విదేశీ కరెన్సీని పూర్తిగా మార్పిడి చేస్తామని చెప్పారు. తిరుమలలో 7500కు పైగా గదులు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయించడం జరిగింది. ఇటీవల ప్రవేశపెట్టి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగిందని తెలిపారు.