తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి సంబంధించి... 7,235 కేజీల బంగారం 2 జాతీయ బ్యాంకుల్లో, వేర్వేరు డిపాజిట్ స్కీమ్లతో డిపాజిట్ అయివుంది. టీటీడీ ట్రెజరీలో దాదాపు 1,934 కేజీల బంగారం ఉంది. ఇందులో ఇటీవల మూడేళ్ల డిపాటిజ్ స్కీమ్ ముగిసిపోవడంతో... పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచీ రిటర్న్ తెచ్చుకున్న 1,381 కేజీల బంగారం కూడా ఉంది.
సాధారణంగా బంగారం నిల్వలపై వివరాలు చెప్పేందుకు టీటీడీ ఇష్టపడదు. కానీ ఇటీవల ఆ 1,381 కేజీల గోల్డ్ పై వివాదం చెలరేగడం, తమిళనాడుకు చెందిన ఎన్నికల పోలీసు అధికారులు ఏప్రిల్లో జరిపిన తనిఖీల్లో ఆ బంగారం పట్టుపడటం... అది టీటీడీది అని తేలడం వంటి అంశాలు గందరగోళానికి దారితీశాయి. దాంతో టీటీడీపీ పూర్తి వివరాల్ని బయటపెట్టింది. (Image : தமிழ்செல்வன்நல்லசாமி / Twitter)
పంజాబ్ నేషనల్ బ్యాంకుకి చెందిన ఓ ట్రక్కు... 1381 కేజీల బంగారాన్ని చెన్నై బ్రాంచ్ నుంచీ తిరుమలకు తీసుకెళ్తుండగా... తిరువల్లూర్ జిల్లాలో ఏప్రిల్ 17న తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. మర్నాడు ఎన్నికలు ఉన్న సందర్భంగా జరిపిన తనిఖీల్లో ఈ బంగారం దొరకడం కలకలం రేపింది. బ్యాంకు అధికారులు అది టీటీడీ బంగారం అని తెలిపారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్... తమిళనాడు ఇన్కం టాక్స్ అధికారులకు పూర్తి ఆధారాలు సమర్పించడంతో రెండ్రోజుల తర్వాత ఆ బంగారం... టీటీడీ ట్రెజరీకి చేరింది. తద్వారా ఆ బంగారం టీటీడీకి చెందినట్లైంది. దీనిపై దర్యాప్తు జరిపించాలని ఏపీ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఇందులో ఎలాంటి అక్రమమూ లేదంటూ టీటీడీ పాలకమండలి కార్యనిర్వహణ అధికారి అనీల్ కుమార్ సింఘాల్ మీడియాకు తెలిపారు.
క్రీస్తు శకం 300 సంవత్సరంలో టీటీడీని నిర్మించినట్లు చెబుతున్నారు. అప్పటి నుంచీ రోజూ 50,000 నుంచీ లక్ష మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఏకంగా రోజుకు 4-5 లక్షల మంది వస్తున్నారు. భక్తులు కానుకలుగా క్యాష్, బంగారం, వెండి, ఆస్తి పత్రాలు, డీమ్యాట్ షేర్లను ఇస్తున్నారు. ఏటా టీటీడీకి హుండీ కలెక్షన్ల కింద రూ.1,000 కోట్ల నుంచీ రూ.1,200 కోట్ల దాకా వస్తోంది.