శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10వేలు విరాళం ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం అంటూ ప్రచారం జరిగింది.
2/ 8
ఇకపై సాధారణ భక్తులు కూడా వీఐపీల్లాగా బ్రేక్ దర్శనం చేసుకోవచ్చంటూ వార్తలు వచ్చాయి.
3/ 8
శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ (శ్రీవాణి ట్రస్ట్)కు రూ.10వేలు విరాళం ఇచ్చే భక్తులకు బ్రేక్ దర్శనం కల్పించాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
4/ 8
వీఐపీ దర్శనాల కోసం ప్రజాప్రతినిధులు, ప్రముఖుల లేఖలు తీసుకురావాల్సి వచ్చేది.
5/ 8
అయితే, అందరికీ నేతలు, ప్రముఖుల సిఫారసు లేఖలు దొరికే అవకాశం లేదు కాబట్టి, రూ.10వేలు శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇస్తే వారికి వీఐపీ తరహాలో బ్రేక్ దర్శనం కల్పిస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
6/ 8
అయితే, తిరుమలలో అలాంటి దర్శనం ప్రతిపాదన ఏదీ లేదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.
7/ 8
ఇలాంటి విధానపరమైన నిర్ణయాలను ముందుగా బోర్డులో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
8/ 8
రూ.10వేలు విరాళం ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం అనే వార్తలను నమ్మొద్దని ఈవో సూచించారు.