TTD EO Transfer: టీటీడీ ఈవో ఏకే సింఘాల్ బదిలీ, కొత్త ఈవో ఎవరంటే

తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. దేవాదాయ శాఖ నుంచి ఆయన్ను తప్పించి హెల్త్, మెడికల్, కుటుంబసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.