Tirumala: ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? మీ కోసమే ఈ కీలక అప్డేట్
Tirumala: ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? మీ కోసమే ఈ కీలక అప్డేట్
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది భక్తులు వెళ్తుంటారు. తిరుపతికి వెళ్లే భక్తులు ఒక నెల ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుంటారు. మరి ఫిబ్రవరిలో తిరుమలకు వెళ్లే వారి కోసం టీటీడీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది భక్తుల తరలి వస్తుంటారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి.. ఏడుకొండల వెంకన్నను దర్శించుకుంటారు. ఐతే తిరుపతికి వెళ్లే భక్తులు.. రైలు,ఫ్లైట్ టికెట్స్ మొదలు.. శ్రీవారి దర్శనం, వసతికి వరకు.. అన్నీ ముందుగానే బుక్ చేస్తుంటారు.
2/ 6
శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, తిరుమల తిరుపతిలో టీటీడీ అద్దె గదుల బుకింగ్స్‌ను టీటీడీ ప్రతి నెలా విడుదల చేస్తుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన 300 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు, తిరుమల అద్దె గదుల బుకింగ్ ఇప్పటికే విడుదల చేశారు.
3/ 6
ఈ నేపథ్యంలో తిరుపతిలో అకామడేషన్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొండ మీద రూమ్స్ దొరకని వారు.. కనీసం కొండ కిందైనా దొరుకుతాయని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి టీటీడీ నుంచి అప్డేట్ వచ్చింది. తిరుపతిలో వసత గదుల బుకింగ్స్‌ను రేపు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
4/ 6
ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుపతి అకామడేషన్ కోటాను జనవరి 30న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఆ టికెట్లు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్‌తో పాటు ఇటీవల కొత్తగా విడుదలైన టీటీ దేవస్థానమ్స్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.
5/ 6
అంతేకాదు టీటీడీ పరిధిలోని లోకల్ టెంపుల్స్‌కి సంబంధించిన సేవా టికెట్లను కూడా జనవరి 30న విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన సేవా టికెట్లను సోమవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది.
6/ 6
కాగా, జనవరి 28 రథసప్తమి రోజు 80,094 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 32,219 మంది తలనీలాలను సమర్పించారు. భక్తుల కానుకల రూపంలో శ్రీవారి హుండీకి 3.15 కోట్ల ఆదాయం వచ్చింది. టైమ్ స్లాట్ టోకెన్ లేని భక్తులకు దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.