ఐతే దీనిపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆర్జిత సేవల పెంపు ఉద్దేశం లేదని.. పెంపు ప్రతిపాదనలు కేవలం సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు మాత్రమేనన్నారు. సామాన్య భక్తుల తీసుకునే ఆర్జిత సేవల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. సిఫార్సు లేఖళ ఒత్తిడి తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీఠ వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
మార్చి నెల కోటాకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల సంఖ్యను కూడా పెంచేందుకు టీటీడీ సిద్ధమైంది. రోజుకు 25వేల చొప్పున జారీ చేయనుంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు కూడా రోజుకు 20వేల చొప్పున విడుదల చేయనుంది. దీంతో సిఫార్సు లేఖలు, ఆన్ లైన్ సేవలు, ఇతర కోటాల్లో ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 60వేలకు చేరనుంది.