అలిపిరి వద్ద, మెట్ల మార్గంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామన్న వైవీ సుబ్బారెడ్డి... కోనేట్లో స్నానాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఈ నెల 8 నుంచి దేవాలయాల్లో భక్తులకు అనుమతించుకోవచ్చని కేంద్రం చెప్పడంతో... అందరి దృష్టి తిరుమలపై పడింది. తిరుమల కొండపై భక్తులకు ఎప్పుడు అనుమతిస్తారు ? ఎప్పుడు వెంకన్న దర్శనం చేసుకుంటామని భక్తకోటి ఎదురుచూస్తోంది.
2/ 7
తాజాగా దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ 19 నివారణ చర్యలను పాటిస్తూ శ్రీవారి దర్శనాలు కల్పించడంపై దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు.
3/ 7
ఈ నెల 8 నుంచి ట్రయల్ రన్ పద్ధతిన శ్రీవారి దర్శనాలు ఉంటాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
4/ 7
ముందుగా 7-8 వేల మంది భక్తులతో దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నామని అన్నారు. దర్శనాలు మూడు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
5/ 7
10 లేదా 11వ తేదీ నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సర్వదర్శనానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
6/ 7
అలిపిరి వద్ద, మెట్ల మార్గంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామన్న వైవీ సుబ్బారెడ్డి... కోనేట్లో స్నానాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
7/ 7
పూర్తిస్థాయిలో దర్శనాలు ప్రారంభమైతే... బయట ప్రాంతాల్లో లడ్డూలు అమ్మకాలు ఉండవని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.