P Anand Mohan, Visakhapatnam, News18. Marriage Tragedy: ఎంతో అందమైన జీవితం ఊహించుకుంది. కొన్ని క్షణాల్లోనే తన జీవితం మారుతోంది.. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తున్నానని.. అర్థం చేసుకునే భర్త దొరికాడు.. ఇక తన జీవితం వేరే లెవెల్లో ఉంటుందని.. కొత్త బాధ్యతలు వస్తాయి అని.. ఇలా ఎన్నో ఊహలతో పెళ్లి పీటలపైకి ఎక్కింది నవ వధువు.. ఇలా ఆమె ఊహలన్నీ మధ్యలోనే ఆగిపోతాయి అని ఆమె ఊహించి ఉండదు..
కన్న కూతురు పెళ్లి గ్రాండ్ గా చేయాలని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు.. అనుకున్నట్టే అందరినీ పిలిచి.. భారీ హంగులతో ఆ పెళ్లి వేడుక జరుగుతోంది. అయితే పెళ్లి కొడుకు కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉండడంతో.. భారీగానే బంధువులు, సన్నిహితులు, అనుచరులు వచ్చారు.. వివాహ తతంగమంతా చాలా గ్రాండ్ గా జరుగుతోంది. పెళ్లి మండపం అంతా సందడిగా కనిపించింది.
ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే.. వైద్యులు ఆమె మరణించినట్టు నిర్ధారించారు. దీంతో రెండు కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. సంతోషంగా.. చాలా సందడిగా ఉండాల్సిన ఆ పెళ్లి మండపం.. ఇటు రెండు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. అయితే ఆమె బాగా అలసి పోయి ఉందని.. ఆ అలసట కారణంగా గుండె పోటుతో మరణించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.