గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా.. ఈ వేడుకలపై ఆంక్షలతో పండుగపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం కరోనా పూర్తిగా తగ్గుముఖం తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం జరిగే హోలీల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి హొలీ సంబరాల్లో ఓ వైపు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు(Health Care Tips) తీసుకోవాలి.. దీనికి తోడు కళ్లు.. చర్మేన్నీ కూడా కాపాడుకోవాల్సిన అసవరం ఉంది.
హోలీ రోజున ఉపయోగించే వాటర్ బెలూన్లు కూడా ఒకొక్కసారి కంటికి గాయాలు చేస్తాయంటున్నారు. ఈ బెలూన్లు.. వ్యక్తుల ముఖంపై నేరుగా తగిలి కళ్లకు కోలుకోలేని నష్టం కలిగిస్తాయని హెచ్చరిసతున్నారు. ఒకొక్కసారి కంటికి గాయాలు అయ్యి.. ఆ గాయం నుంచి రక్తస్రావం, కళ్ళు వాపు, లేదా రెటీనా డిటాచ్మెంట్కు దారితీసే ప్రమాదాన్ని కొట్టి పారేయలేం.. శాశ్వత దృష్టిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు.
ఒకవేళ హోలీ ఆడుతున్న సమయంలో కంటిలో రంగులు పడితే.. కంటిని ఎట్టి పరిస్థితుల్లో రబ్ చేయవద్దు. వెంటనే కళ్ళను శుభ్రమైన నీటితో కడగాలి. వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం అయితే ఒకొక్కసారి కంటిపై ఆ గాయాలు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయని హెచ్చిరిస్తున్నారు. కంటిలో రంగులు పడితే వాటిని చేతులతో తొలగించే ప్రయత్నం చేయవద్దు. కళ్ళను శుభ్రమైన నీటితో కడుక్కోవడంతో పాటు.. చేతుల్లో శుభ్రమైన నీరు తీసుకుని కంటి రెప్ప వేయండి. ఇలా చేయడం వలన కళ్లలోని రంగు కణాలను తొలగించి రసాయనాల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.
కేవలం కళ్ల విషయంలోనే కాదు.. చర్మం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. కొన్ని సార్లు రంగులు చర్మానికి హానికరంగా మారతాయి. దద్దుర్లు వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్కిన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ రంగులు.. చర్మంపై అలెర్జీ కారకాలని చెప్పారు. హొలీ తరువాత చర్మంపై రంగులను తొలగించడానికి ప్రయత్నించే సమయంలో ఒకొక్కసారి దురద, దద్దుర్లు, వాపు ఏర్పడవచ్చు.
రంగులు గోళ్ళ క్రింద చిక్కుకుని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. స్కిన్ అలర్జీలు రాకుండా ఉండాలంటే.. హొలీ ముందు రోజు రాత్రి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మానికి స్కిన్ కేర్ కు సంబంధించిన లోషన్స్ కు దూరంగా ఉండాలి. అయితే హోలీ ఆడడానికి వెళ్ళే ముందు.. శరీరానికి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ నూనెలను రాసుకోవడం చర్మం సురక్షితంగా ఉంటుంది అంటున్నారు.