ఆంధ్రప్రదేశ్ లో టమాటాకు కేరాఫ్ అడ్రస్ అయిన చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో కిలో టమాటా రేటు ఏకంగా వంద రూపాయలు దాటేసింది. మార్కెట్లో 28 కిలోల టమాటా కేట్ ను ఏకంగా రూ.2,800 కు అమ్ముడుబోవడంతో రైతులు ముక్కున వేలేసుకున్నారు. మార్కెట్లో గ్రేడ్ ఏ టమాటా రూ.60 నుంచి రూ.100 పలకగా.. గ్రేట్ బీ కిలో రూ.16 నుంచి రూ.58 పలికింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్లో కిలో టమాటా రూ.100కు విక్రయించారు. రెండు రోజుల క్రితం రూ.50-60 మధ్య ఉన్న ధర ఒక్కసారిగా వంద చేరింది. టమాటా మార్కెట్లలోనే ఇంత ధర పలుకుతుండటంతో రైతు బజార్లు, రిటైల్ కూరగాయల మార్కెట్లలో ఆకాశాన్నంటుతున్నాయి. ఇక కార్పొరేట్ మార్కెట్లలో అయితే చెప్పనవసరం లేదు. (ప్రతీకాత్మకచిత్రం)